News

మ‌దినిండా సేవాభావం… కోటా ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌క క‌వ‌చం

485views

కోట: అక్క‌డి ప్ర‌జ‌ల్లో చాలా మందికి మంది నిండా సేవాభావం ఉంది. ఆ ప్రాంతానికి ఏ క్ష‌ణాన ఏ ఆప‌దొచ్చిన సేవాభావం క‌లిగిన ఆ వ్య‌క్తులు అక్క‌డ త‌క్ష‌ణం ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. గొప్ప‌లు, గుర్తింపులు వారికి అన‌వ‌స‌రం… వారు త‌ల‌పెట్టిన సేవ నూటికి నూరుశాతం అయిందా? లేదా? అన్న‌దానిపై వారి ధ్యాస‌.. ఆశ‌.. అయింద‌ని తేలితేనే అక్క‌డి నుంచి క‌దులుతారు. అప్ప‌టి వ‌ర‌కు నిద్రాహారాలు వారి ద‌రికి చేర‌వు. వారే రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ(ఆర్‌.ఎస్‌.ఎస్‌) కార్య‌క‌ర్త‌లు!

ఆగ్రా జిల్లాలోని బహ్, పినహత్ ప్రాంతాల్లో చంబల్ నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. బుధవారం తెల్లవారుజామున గ్రామం, ఇళ్ళు, పొలాల్లోకి వరద నీరు చేరింది. ఈ ఆప‌ద నుంచి బ‌య‌ట‌ప‌డే నిమిత్తం రాత్రికి గ్రామాన్ని ఖాళీ చేసేశారు. రాత్రంతా వాగులోని ఎత్తైన దిబ్బలపై గడిపారు. బహ్ తహసీల్‌లోని ఝర్నాపూర్ గ్రామంలో, చంబల్ నీరు మంగళవారం రాత్రి 11 గంటలకు చేరుకుంది. కోటా జిల్లాలోని ఇటావా సెక్షన్‌లోకి వ‌రద ముంచెత్తింది.

గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధిత కుటుంబాలు చిన్న‌పాటి దీపాల వెలుగులో నిత్యావసర వస్తువులతో ఎత్తైన కొండలపైకి చేరుకున్నారు. భగవాన్ పురా గ్రామ ప్రజలు కూడా అర్ధ‌రాత్రి లోతట్టు ప్రాంతంలోని ఇళ్ళ‌ను ఖాళీ చేసి, ఎగుడుదిగుడుగా ఉన్న దిబ్బలపై టెంట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉరే పురా ప్రజలు కూడా ఎత్తైన ప్రాంతాల్లో విడిది చేశారు.

కోట బ్యారేజీ నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో చంబల్ నది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి నది నీటిమట్టం 132 మీటర్లకు చేరుకుంది. కాగా, డేంజర్ మార్క్ 130 మీటర్లు. తహసీల్, జిల్లా ప్రధాన కార్యాలయాలతో 17 కంటే ఎక్కువ గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పాఠశాలలు, పొలాలు, కొట్టాలు, ఇళ్ళు నీటితో నిండిపోయాయి.

ఇటువంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగారు. భుజం భుజం క‌లిపి వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందించ‌డం మొద‌లెట్టారు. కొన్ని చోట్ల చిన్న‌పాటి బోటు సాయంతో ముంపు ప్రాంతాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.

Source:  . VSK Chittor

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి