
398views
కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపు ఇచ్చింది. దీక్షలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా తన నివాసంలోనే నిరసన దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. మరోవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది.





