News

పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దాం

430views

చీపురుప‌ల్లి: భారతీయ సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దామ‌ని ఇక్క‌డి మిత్ర సేవా సంఘం అధ్య‌క్షుడు గ‌విడి రామ‌కృష్ణ అన్నారు. విగ్రహ పరిమాణం ముఖ్యం కాదు.. భక్తి , శ్రద్దా ముఖ్య‌మ‌ని వినాయకచవితి సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని, ప్లాస్ట ఆఫ్ పారిష‌తో తయారు చేసిన‌, విగ్రహాలు ఉపయోగించి పర్యావరణానికి హాని చేయొద్దని రామకృష్ణ కోరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంగ‌ళ‌వారం విలేఖ‌ర్ల‌తో మాట్లాడారు.

చీపురుపల్లిలో కుమ్మరి కాల‌నీలో సుమారుగా ప‌దేళ్ళ నుంచి మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న కోటి అనే బొమ్మల తయారీదారిని దగ్గరకు బొమ్మ‌ల‌ను ప‌రిశీలించామ‌ని, ఎంతో చూడ‌ముచ్చ‌గా ఉన్నాయ‌న్నారు. మిత్ర సేవా సంఘం ద్వారా అయిదేళ్ళుగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి