News

5 నెలల త‌ర్వాత కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనం

377views

కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం నేటి నుంచి ల‌భించింది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు దర్శనం నిలిపివేశారు. నవగ్రహ మండపం వెనుక భాగంలో బాలాలయం నిర్మించారు. అత్తికొయ్యతో వినాయక స్వామి ప్రతిమను సిద్ధం చేశారు.

ఆ రోజు నుంచి శనివారం వరకు దాదాపుగా ఐదునెలల పాటు భక్తులకు బాలాలయంలోనే స్వామి దర్శనం లభించింది. ఇక కుంభాభిషేకం క్రతువు ముగిసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొత్త ఆలయంలోని స్వయంభు మూలవిరాట్టు దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు తెలిపారు. ఈ నెల 31 నుంచి కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొత్తం 21 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి