News

బంగ్లాలో హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌రవు!

616views
  • ఇద్ద‌రు హిందూ అమ్మాయిలకు నిత్యం వేధింపులు

  • నిందితులైన ముస్లింల‌ను అడ్డుకున్న తండ్రికి క‌త్తిపోట్లు

  • బిక్కుబిక్కుమంటున్న హిందూ కుటుంబాలు

బంగ్లాదేశ్: బ‌ంగ్లాదేశ్‌లో హిందువుల ప‌రిస్థితి రోజు రోజుకూ దిగ‌జారుతోంది. స్థానిక ముస్లింల నుంచి ఏ క్ష‌ణాన ఏ ముప్పు వ‌చ్చి ప‌డుతుందోన‌ని అక్క‌డి హిందువులు బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు. తాజాగా ముస్లిం యువ‌కులు అక్కాచెల్లిళ్ళ‌యిన హిందూ అమ్మాయిల‌ను నిత్యం వేధిస్తున్నారు. తండ్రి అడ్డుకోవ‌డంతో ఆ కుటుంబానికి ముప్పు త‌ప్పింది. అయితే, అడ్డుకున్న ఆ తండ్రికి కత్తుల‌తో త‌ల‌పై న‌రికారు. ర‌క్ష‌ణ కోసం స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ వెళ్ళినా అక్క‌డి పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం లేదంటే బంగ్లాదేశ్‌లో ప‌రిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోచ్చు.

హిందూ యువతి, బాధిత కుటుంబం విలేఖ‌రుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశం వివ‌రాలు బంగ్లాదేశ్‌కు చెందిన DBC న్యూస్‌లో వెలువ‌డ్డాయి. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17 నాటి 4 నిమిషాల 46 సెకన్ల నిడివి గల వీడియోలో బాలిక తాను రాజ్‌షాహి కళాశాల విద్యార్థిని అని, చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు పేర్కొంది.

డ‌బ్బు కోసం వేధింపులు

శుక్రవారం, ఆగష్టు 12, ఆమె తన ప్రైవేట్ తరగతులకు వెళ్ళింది. దారిలో మిరాజ్, ప్రిన్స్ అనే ముస్లిం సమాజానికి చెందిన ఇద్దరు దుర్మార్గులు ఆమెను వేధించారు. స్థానిక యువకుడు ఆమెకు రక్షణ కల్పించి కొంత దూరం వెళ్ళాడు. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో, బాలికను వేధించిన ఇస్లామిక్ దుండగులను ఎదుర్కొనేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో తండ్రిని దుండగులు కత్తితో పొడిచి, సుత్తితో కొట్టారు.
ముస్లింల దాడి నుంచి భర్తను రక్షించేందుకు ముందుకు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆమె బ్లౌజ్ చింపి 20 వేల విలువైన గొలుసు, నగదు లాక్కొని పారిపోయారని బాధిత కుటుంబం విలేఖ‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించింది.

ఈ సంఘటన ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో జరిగింది. తాము బ్యూటీ పార్లర్‌ను నడుపుతున్నామ‌ని, ఈ దుర్మార్గులు తమ నుండి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారని ఆమె ఆందోళ‌న వ్యక్తం చేసింది.

తండ్రి కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ దుర్మార్గులు తన కూతుళ్లను నిత్యం వేధిస్తున్నార‌ని తెలిపారు. తన కూతుళ్ళ‌ను వేధించవద్దని ఈ దుర్మార్గులను ఒప్పించే ప్రయత్నం చేసిన‌ట్టు తెలిపారు. మీరు బ‌తికి ఉండాలంటే, మాకు కొంత డ‌బ్బు చెల్లించాల‌ని డిమాండ్ చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. లేకుంటే మీ కూతురిని పెళ్లి చేసుకుంటాను అని దాడి చేసిన వారిలో ఒకరు హెచ్చిరించిన‌ట్టు ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఫిర్యాదు ఇచ్చేందుకు స‌మీపంలో చంద్రిమా పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాను. కానీ వారు ఈ కేసును తీసుకోమ‌ని మాకు చెప్పారు… అని ఆ బాధిత తండ్రి తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప్ర‌త్రి వైద్య‌లు కూడా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తాను పూర్తిగా కోలుకోక‌ముందే బ‌ల‌వంతంగా ఇంటికి పంపేశార‌ని ఆయ‌న తెలిపారు. కాగా, ఇస్లామిస్ట్ రాజ్యంలో మిగిలి ఉన్న చివరి హిందువులకు రాబోయే రోజులు భయంకరంగా, మరింత కష్టతరంగా మారనున్నాయ‌న్న ఆందోళ‌న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి