
న్యూఢిల్లీ: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు హవాలా ద్వారా సొమ్మును చేరవేస్తున్న మహ్మద్ యాసిన్‌ను ఢిల్లీ స్పెషల్ టీం శుక్రవారం అరెస్ట్ చేసింది. హవాలా ద్వారా 10 లక్షల రూపాయలను ట్రాన్ఫ్సర్ చేశాడని, ఆ 10 లక్షలు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని పోలీసుల విచారణలో తేలింది.
ఇస్లామిక్ ఉగ్రవాదుల కోసం ఢిల్లీలోని మీనా బజార్ నుంచే ఓ వ్యక్తి పనిచేస్తున్నారన్న పక్కా సమాచారం అందింది. దీంతో ఢిల్లీ స్పెషల్ టీం, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు దర్యాప్తు చేయగా… మహ్మద్ యాసిన్ పట్టుబడ్డాడు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించగా… విదేశాల నుంచి హవాలా సొమ్ము వస్తే… దానిని జాగ్రత్తగా జమ్మూ కశ్మీర్‌లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు చేరవేస్తుంటాడని తేలింది. దక్షిణాఫ్రికా ద్వారా సూరత్, ముంబైకు చేరవేస్తుంటానని, అక్కడి నుంచి జమ్మూ కశ్మీర్‌లో వున్న ఉగ్రవాదులకు నిధులు వెళ్తాయని మహ్మద్ యాసిన్ విచారణ సందర్భంగా వెల్లడించాడు.
Source: RITAM