News

ముంబైలో బాంబు దాడులు చేస్తామని పాకిస్తాన్ నుంచి బెదిరింపులు

260views

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్టు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్​ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి