News

మహారాష్ట్ర తీరంలో ఏకే-47 రైఫిళ్ళు!

400views

ముంబాయి: మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌గఢ్ జిల్లా శ్రీవర్ధన్‌లో అనుమానాస్పద బోటు కనిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్ళతో పాటు కాట్రిజ్డ్‌లు లభ్యమయ్యాయి. హరిహరేశ్వర్‌లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్ జాకెట్, కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయి.

శ్రీవర్ధన్‌లోని హరిహరేశ్వర్, భరద్‌ఖోల్ వద్ద పడవలు గుర్తించారు. హరిహరేశ్వర్‌ వద్ద పడవలో రెండు-మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు లభ్యమయ్యాయి. రెండు పడవల దగ్గర ఎవరూ కనిపించలేదు. అధికారులు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హెడ్‌కు సమాచారం అందించారు.. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి