
బ్యాంకాక్: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా బ్యాంకాక్‌లో పాల్గొన్న సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దేశ రాజకీయాలు పట్టించుకోనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల థాయ్‌ల్యాండ్ వెళ్ళిన జైశంకర్ అక్కడ బ్యాంకాక్‌లోని భారత కమ్యూనిటీ వారితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం గురించి ఓ తమిళుడు తమ రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ జైశంకర్‌ను ప్రశ్నించారు.
దానికి జైశంకర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను విదేశాలను వచ్చినప్పుడు దేశ రాజకీయలు పట్టించుకోనని ఆయన తెలిపారు. ‘నేను విదేశాలకు వచ్చినప్పుడు దేశ రాజకీయాల్లో తలదూర్చను. మీరు నన్ను ఇదే ప్రశ్న అడగాలనుకుంటే భారత్‌కు రండి. అక్కడ నేను మీకు సమాధనం ఇస్తాను’ అని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం జైశంకర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం క్లారిటీగా ఉన్నారంటూ పొడిగేస్తున్నారు.
Source: Disa





