
354views
కోల్‌కతా: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈడీ బృందం కోల్‌కతాలోని ఆయన శిక్ష అనుభవిస్తున్న జైలుకు వెళ్ళింది. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే పలుమార్లు పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలైన సినీనటి అర్పితా ముఖర్జీని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అర్పితను విచారించిన ఈడీ అధికారులు.. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా మరోసారి పార్థా ఛటర్జీని ప్రశ్నించేందుకు ప్రెసిడెన్సీ కరక్షనల్ హోమ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు మాట్లాడుతూ.. ”అర్పితా ముఖర్జీని నిన్న ప్రశ్నించాం. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈరోజు పార్థా ఛటర్జీని విచారిస్తున్నాం” అని వెల్లడించారు.
Source: EtvBharat





