
364views
పంజాబ్: పంజాబ్‌లో కేంద్ర నిఘా సంస్థ పోలీస్ ఇంటి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్ఐ దిల్‌బాగ్ సింగ్ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఉగ్రకుట్ర ఉన్నట్టు అదనపు డీజీ డోఖే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్ఐ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అమృత్‌సర్ పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
Source: EtvBharat





