News

ఆరుగురు జవాన్ల మృతి

509views

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సంభ‌వించిన విష‌యం విదిత‌మే. స‌మాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అమర్‌నాథ్‌ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ సిబ్బందితో కూడిన బస్సు చందన్‌వారీ నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ఫ్రిస్‌లాన్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.