
120views
కశ్మీర్: కశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన వారిగా కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడిని సునీల్‌కుమార్‌గా, గాయపడిన వ్యక్తిని పింటూ కుమార్‌గా పోలీసు అధికారి గుర్తించారు.
Source: Nijamtoday