158
ఉత్తరప్రదేశ్ లో ఐఈడీ కలకలం రేపింది. ఐసిస్ తో లింకులున్న ఓ ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది. ఆజంగఢ్ లోని ముబారక్ నగర్ నుంచి నిందితుడు షాబుద్దీన్ ను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఐఈడీ బాంబుదాడి చేసేందుకు నిందితుడు కుట్రపన్నాడని పోలీసులు వెల్లడించారు.