News

వద్దన్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘానౌక

148views

రోజురోజుకూ చైనా ఆగడాలు శృతి మించుతున్నాయ్. చుట్టు ప్రక్కల ఉన్న దేశాలన్నింటితోనూ గిల్లి కజ్జాలకు దిగుతోంది. కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ధన, ఆయుధ బలంతో అందరినీ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తాజాగా చైనా నిఘానౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ నౌకను శ్రీలంకలోని హంబన్ టొట రేవులో లంగర్ వేసేందుకు అనుమతి ఇవ్వడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో లంక అధికారులు ఆ నౌక రాకను వాయిదా వేయాలని కోరారు. ఆ మాటలను చైనా వినిపించుకోవడం లేదు. ఈ నౌక భారత్లో 750KM దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. దీని సాయంతో భారత క్షిపణి పరీక్షలను చైనా పరిశీలించి సమాచారం సేకరించే ఉంది. ఇప్పుడిక మన సైనికాధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.