News

ముస్లిముల తోడ్పాటుతో కొండెక్కిన శివయ్య

389views

* జమ్మూ కాశ్మీర్లో నూతన దృశ్యం ఆవిష్కారం

* 370 ఆర్టికల్ రద్దు చలవేనంటున్న విశ్లేషకులు

మ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు సత్ఫలితాలను ఇస్తున్నదన్న విషయం మరోసారి ఋజువైంది. తీవ్రవాదులతో చేతులు కలిపి ఇన్నాళ్ళూ స్థానిక హిందువులను శత్రువులుగా చూసి, వారిని హింసించి, వేధించి, తరిమికొట్టి వారి ఇళ్ళను, ఆస్తులను ఆక్రమించుకున్నవారే నేడు విశాల హృదయంతో స్నేహహస్తం చాస్తున్నారు. ఇన్నాళ్ళూ హిందూ దేవాలయాలను కూల్చినవారే ఇప్పుడు హిందూ దేవాలయాల పునఃప్రారంభంలో, పునర్నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు.

అది జమ్మూ-కశ్మీర్ లోని ఓ కొండప్రాంతంపై ఉన్న పురాతన శివాలయం. దాని పునర్నిర్మాణం ఈమధ్యే పూర్తయింది. అక్కడ ప్రతిష్టించడానికి రాజస్థాన్ నుంచి ఆరు భారీ గ్రానైట్ విగ్రహాలను తీసుకొచ్చారు. కానీ రహదారి సౌకర్యం లేని చోట కొండపైకి వాటిని తరలించడం కష్టసాధ్యంగా మారింది. పెద్ద ఎత్తున మనుషులు, యంత్రాల సాయం ఉంటే తప్ప విగ్రహాలను కోవెలలోకి చేర్చలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో మేమున్నామంటూ ముందుకొచ్చారు స్థానిక ముస్లింలు. అప్పటికప్పుడు పంచాయతీ నిధులతో రహదారి నిర్మించడమే కాదు.. విగ్రహాలను కొండపైకి తరలించడానికి హిందువులతో భుజం కలిపారు. నాలుగురోజుల పాటు అలుపన్నది లేకుండా శ్రమించారు. వీరికి భారత సైన్యం సాయం కూడా తోడైంది. దీంతో దేవతల విగ్రహాలు గుడికి చేరడానికి మార్గం సుగమమైంది.

మత సామరస్యానికి ఆసలైన నిర్వచనం లాంటి ఈ దృశ్యం జమ్మూ కశ్మీర్ దోదా జిల్లాలోని కుర్వారీ గ్రామంలో ఆవిష్కృతమైంది. ఒక్కోటి 500 నుంచి 700 కిలోల బరువున్న విగ్రహాలను రాజస్థాన్ నుంచి తీసుకురాగా, వాటిని కొండపైకి 3 కి.మీ. దూరం తరలించడం దేవాలయ నిర్మాణ కమిటీకి కష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన కుర్వార్ పంచాయతీ సర్పంచి సాజిద్ మిర్ తక్షణం స్పందించారు. కొండపైకి తాత్కాలిక రహదారి నిర్మాణానికి రూ. 1.0 లక్షల పంచాయతీ నిధులు కేటా యించారు. గ్రామంలో తన సామాజిక వర్గానికి చెందిన 150 మందిని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పురమాయించారు.

దీంతో గత నాలుగు రోజులుగా ఇరు వర్గాల్లోని వాలంటీర్లు చేయి చేయి కలిపి యంత్రాల సహాయంతో విగ్రహాలను కొండ పైకి చేర్చే పని చేపట్టారు. వీరి సామరస్యాన్ని గమనించిన మిలిటరీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్, రహ దారి నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు తమ వంతు చేయూత ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. సైనిక యూనిట్ అవసరమైన యంత్రసామగ్రిని, సిబ్బందిని పంపింది. ఈ నెల 9న శివాలయంలో విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇదే మన సంస్కృతి. ఇవే మన విలువలు. వీటినే మేం వారసత్వంగా పొందాం. ఈ భావాల కారణంగానే మేం ఎన్నడూ మతం పేరుతో వేరుచేయాలనుకునే వారి కుట్రల బారినపడలేదు” అని సర్పంచి సాజిద్ మిర్ తెలిపారు. “ఒకానొక దశలో ఈ విగ్రహాలను కొండ పైకి చేర్చడం అసాధ్యమనిపించింది. ఆ సమయంలో మా ఇరుగుపొరుగు వారి ప్రేమ, ఆప్యాయత చూసి “మా మనసు ద్రవించింది” అని ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ ప్రదీప్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.