News

అజాదీకా అమృత్ మహోత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఆబాలగోపాలం

141views

దేశ వ్యాప్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలలో పెద్ద ఎత్తున దేశభక్తి ఉప్పొంగుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హర్ ఘర్ తిరంగా పేరుతో ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని యావన్మంది ప్రజలూ హృదయపూర్తిగా స్వాగతిస్తున్నారు. కొందరు అప్పుడే జెండాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని తెచ్చి పెట్టుకుంటున్నారు. కొందరు కొని తెచ్చుకుంటున్నారు. అలాగే హర్ ఘర్ తిరంగా ర్యాలీలలో ఆబాల గోపాలమూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. త్రివర్ణ పతాకాలను చేతబూని ‘భారత్ మాతాకీ జయ్’ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ఒంగోలులో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో నారీమణులు, బాల బాలికలు మువ్వన్నెల జెండాలు చేతపట్టి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో దేశభక్తి గీతాలను సైతం మహిళలు ఆలపించారు. అనంతరం కొత్తపట్నం బస్టాండ్ వద్దకు చేరుకొని, మానవహారంగా ఏర్పడి ‘బోలో భారత్ మాతా కీ జై’ అంటూ నినదించారు. ఒకప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు ఏదో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు సాధారణ ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొంటుండడాన్ని ఓ శుభ పరిణామంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.