News

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ఘన విజయం

334views

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా పై 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల్లో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా అందులో జగదీప్ కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. లెక్కింపు పూర్తైన అనంతరం ఉప రాష్ట్రపతిగా ధన్కర్ ఎన్నికైనట్టు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రకటించారు.

ఫలితం ప్రకటించగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ధన్కర్ బసచేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము కూడా ఆయన్ను అభినందిస్తూ.. ధన్‌ఖడ్‌ ఎన్నికతో దేశ ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి