News

పింగళి వెంకయ్య పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల

601views

న్యూఢిల్లీ: మనం ఎప్పుడూ త్రివర్ణ పతాక రూపకల్పనను మరిచిపోకూడదు. జెండా ప్రస్థానాన్ని అర్థం చేసుకుంటే పింగళి వెంకయ్యను గుర్తుచేసుకోకుండా ఉండలేమ‌ని కేంద్ర హోంమంత్రి అన్నారు.

త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో కేంద్ర సాంస్కృతికశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌, సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డిలతో కలిసి పింగళి వెంకయ్య స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, వారి కుటుంబసభ్యులను సన్మానించారు

ఆ స్వాతంత్య్రసేనాని కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను మూడు రంగుల్లో నిక్షిప్తం చేసి, దేశం మొత్తాన్ని ఏకం చేశారు. అందుకే ఆయనకు దేశం తరఫున శతకోటి నమస్కారాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

ఎన్నో భాషలు తెలిసిన ఆ మహాపురుషుడు లోకమాన్య తిలక్‌, మహాత్మాగాంధీ సిద్ధాంతాల ఆధారంగా సుదీర్ఘ జీవనం సాగించారు. ఎలాంటి పదవులు చేపట్టకుండానే దేశసేవకు అంకితమయ్యారు. 1921లో గాంధీ కొత్త జాతీయ పతకాన్ని రూపొందించే బాధ్యతను పింగళి వెంకయ్యకు అప్పగించారు.

సుభాష్‌చంద్రబోస్‌ 1943 డిసెంబర్‌ 29న పోర్ట్‌బ్లెయిర్‌ జింఖానా గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. త్యాగం, సమృద్ధి, శాంతికి ప్రతిబింబాలైన మూడు రంగులు, మధ్య 24 ఊచలతో ఉన్న ధర్మచక్రం భారత ఆకాంక్షల ప్రతీకలు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి