
443views
-
సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు బెయిల్ నిరాకరణ
భాగ్యనగరం: హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది. మే 28న జూబ్లీహిల్స్ లో అమ్నేషియా పబ్ నుంచి బయటకు వచ్చిన ఒక బాలికపై వీరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 17 ఏళ్ళ అమ్మాయిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఒక్కొక్కరికి రూ. 5 వేల పూచీకత్తుతో పాటు పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలనే షరతుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే కుమారుడికి జువైనల్ బోర్డు బెయిల్ నిరాకరించింది. నిందితుల్లో ఏకైక మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో అతను చంచల్ గూడ జైల్లోనే ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు దాదాపు 400 పేజీల ఛార్జ్ షీట్ ను సిద్ధం చేశారు.
Source: NationalistHub





