News

`సుప్రీం’లో థాక్రేకు మళ్ళీ ఎదురుదెబ్బ..!

435views

న్యూఢిల్లీ: శివసేన చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు ఒక‌టోతేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా ఏక్‌నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయానికి సంబంధించి స్పీకర్‌ కూడా అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో థాక్రే వర్గానికి మళ్ళీ నిరాశే ఎదురైంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి