
ఇస్లామాబాద్: లైవ్‌లోనే ఓ లేడీ జర్నలిస్ట్ ఓ బాలుడి చెంపచెల్లమనిపించింది. ఇది జరిగింది పాకిస్తాన్‌లో. అయితే తను చేసిన చర్యను ఆ లేడీ జర్నలిస్టు మైరా హస్మీ సమర్థించుకుంది. ఈద్- అల్ అధా పండగ సందర్భంగా ఆ లేడీ జర్నలిస్టు లైవ్‌లో పండగ విశేషాలను పంచుకుంటున్నది. ఈ సమయంలో పక్కన గల బాలుడు ఎదుట వారితో వాటర్ బాటిల్‌తో ఏదో సైగ చేశాడు. లైవ్‌లో అడ్డంగా వచ్చాడని లేడీ జర్నలిస్ట్ ఆ బాలుడి చెంపపై కొట్టింది.
ఈ ఘటనపై బాలుడిని కొట్టే హక్కు మీకెవరు ఇచ్చారంటూ నెటిజెన్లు ప్రశ్నించగా.. కొంతమంది మాత్రం సదరు బాలుడు ఏదో అనుచిత ప్రవర్తన చేసిందుకే జర్నలిస్ట్ ఇలా రియాక్ట్ అయిందని ఆమెకు మద్దతు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటనపై జర్నలిస్ట్ మైరా హస్మీ స్పందించారు. లైవ్ జరిగే సమయంలో బాలుడు ఓ కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ ట్వీట్ చేసింది. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని.. కామెంట్ చేసింది.
Source: SGS Tv Telugu





