News

ఆయుర్వేదాన్ని జ్యోతిష్యానికి జోడిస్తే మరిన్ని సత్ఫలితాలు

483views

మీర్జాపూర్: ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని, పలు వ్యాధుల చికిత్స సులభతరం అవుతుందని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ఆర్ ప్ర‌సాద్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్య సమన్వయం అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

ఆయుర్వేదం, జ్యోతిష శాస్త్రాలు వేద సంస్కృతి నుండి ఉద్భవించాయని, మానవుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ఆయుర్వేద వైద్యులు మెడికల్ ఆస్ట్రాలజీలో ప్రవేశం పొంది అవగాహన పెంచుకోవడం ద్వారా, దీర్ఘకాలిక వ్యాధులకు జ్యోతిష్య శాస్త్రంలో పొందుపరిచిన ఔషధాలను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. తన 15 ఏళ్ల పరిశోధనలో ఆయుర్వేదానికి జ్యోతిషాన్ని జోడించడం ద్వారా చికిత్స సులభతరమైందన్నారు.

చిన్నపిల్లల వ్యాధులలో ముఖ్యంగా ఆటిజం, బుద్ధి మాంద్యం, సెరిబ్రల్ పాల్సీ లాంటి వ్యాధులను ముందుగా నయం చేయడానికి జ్యోతిష శాస్త్రం బాగా ఉపయోగపడిందన్నారు. ఆయుర్వేద వైద్య విద్యార్థులు మెడికల్ ఆస్ట్రాలజీని అభ్యసించడం ద్వారా భవిష్యత్ వ్యాధులు అవగాహన, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సను సులువుగా తెలుసుకోవచ్చన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి