
467views
న్యూఢిల్లీ: శ్రీలంక దేశంలో రాజుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో ప్రభుత్వం వైఫల్యంపై నిరసనలు శ్రీలంకలో తీవ్రరూపం దాల్చిన కొన్ని గంటల తర్వాత, ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది. భారత సముద్రంలో అదనపు హోవర్‌క్రాఫ్ట్‌లు, పెట్రోలింగ్ బోట్‌లను మోహరించారు. అక్రమ వలసదారులను నిరోధించేందుకు నిఘా పెంచామని ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. నిరసనకారులు నివాసాన్ని ముట్టడించడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలోని కోస్టల్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. భారతదేశంలోని ఇతర ఏజెన్సీలు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. రామేశ్వరం సమీపంలోని మండపం ప్రాంతంలోని కోస్ట్‌గార్డ్ హోవర్‌పోర్ట్ నిఘా కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.





