News

అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం

508views

కశ్మీర్‌: పవిత్ర గుహ సమీపంలో కుంభవృష్టి అనంతరం వరదలు వెల్లువెత్తడంతో 16 మంది మృతి చెందిన ఘటనతో పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహ సమీపంలో వరదలు సంభవించిన మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.

‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్ళ‌లేం. మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉంది, బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాము. సీఆర్‌పీఎఫ్ ఇతర సిబ్బంది మార్గనిర్దేశం చేశారు. క్షేమంగా ముందుకు సాగుతున్నాం’’ అని అమరనాథ్ యాత్రికులు చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి