News

హర్ష హత్య కేసు ఎన్ఐఏ చేతుల్లోకి… నలుగురు పోలీసులపై కేసు

200views

న్యూఢిల్లీ: హిందూ కార్యకర్త హర్ష హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. రోడ్డు మీద మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు కర్ణాటకలోని శివమొగ్గ చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో నలుగురి మీద పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.

ఇదే సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి శివమొగ్గలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెలుతున్న హర్షాను కొందరు వెంబడించి దాడి చేశారు. ప్రాణాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన హర్షాను నడిరోడ్డులో వెంటాడి వెంటాడి నరికి చంపేశారు. హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్యకు గురికావడంతో శివమొగ్గతో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి