
405views
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో ఎన్‌సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ అన్నారు. ఎన్సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్ ఉన్నవారందరికి బోనస్ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. గ్వాలియర్లో జరిగిన ఎన్‌సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎన్‌సీసీ అధికారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Source: EtvBharat





