
394views
న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు ద్రౌపది ముర్ము దాఖలు చేశారు.
Source: NationalistHub





