
499views
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణంలో వినియోగించేందుకు బంగారు పూతతో తయారు చేసిన సింహాసనాన్ని న్యూయార్క్‌కు చెందిన దాతలు సామల ఆర్ స్వామి, వీరమణి స్వామికి బహూకరించారు. ఈ సందర్భంగా బంగారు పూతతో ఉన్న ఈ సింహాసనానికి ఆలయ ముఖ మండపంలో ఈవో గీతారెడ్డి, ఆలయ ఆచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అధిష్టించి పూజించారు. సింహాసనం విలువ రూ.18 లక్షలు ఉంటుందని దాతలు వెల్లడించారు.





