
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు.
అనాథను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ ఓ ట్విట్టర్ యూజర్ వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని బలవంతంగా సున్తీ చేయించి, ఉర్దూ నేర్చుకునేందుకు మరో ముస్లిం వ్యక్తికి అప్పగించినట్టు గుర్తించారు.
ట్విట్టర్ వినియోగదారులు చర్య కోరుతూ వీడియోకు ట్యాగ్ చేయడంతో ఘజియాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. బాలుడి పేరును పోలీసులు తెలుసుకున్నారు. అతను బీహార్‌లోని ఔరంగాబాద్‌లోని రఫీగంజ్‌లో నివసించేవాడని దర్యాప్తులో తేలింది. అతని తల్లి రైలు ప్రమాదంలో మరణించింది. తండ్రి అతనిని విడిచిపెట్టాడు. దీంతో బాలుడు కొన్ని నెలల తర్వాత ఇంటిని విడిచిపెట్టాడు. ఈ స్థితిలో బాలుడి తల్లి స్నేహితురాలు తీసుకువెళ్ళింది. బాలుడు ఆమె ఇంట్లో పెరిగాడు. అయితే, అక్కడ రోజూ వేధింపులకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే బాలుడిని విక్రయించేందుకు మధ్యవర్తి జుల్ఫికర్ ద్వారా ఉమర్ మహ్మద్, బాబ్లీ అనే మరో దంపతులతో దంపతులు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రూ.50 స్టాంపు పేపర్‌పై సంతకాలు చేశారు. తరువాత జుల్ఫికర్ తీసుకువెళ్ళిపోయాడు. అతను బాలుడికి సున్తీ చేయించి, అతనికి ఉర్దూ నేర్పించి ఇస్లాంలోకి మార్చాడు. బాలుడు ఘజియాబాద్‌కు వచ్చి తన తల్లికి పరిచయమైన రాజేష్ కుమార్‌ను కలిసినప్పుడు జుల్ఫికర్ బారి నుండి తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, మొత్తం అయిదుగురు నిందితుల్లో ఇద్దరు పరార్‌లో ఉన్నారు.
Source: HINDU POST





