News

పూజ్య డాక్టర్ జీపై కర్ణాటక మాజీ సీఎం అనుచిత వ్యాఖ్యలు… ఆగ్రహించిన బీజేపీ

500views

బెంగ‌ళూరు: ఆర్‌ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్‌ హెగ్డేవార్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో బ్రిటీష్ వారితో చేతులు కలిపాడంటూ మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన తప్పుడు వ్యాఖ్య ఆయన్ను ఇరకాటంలో పడేసింది. దీనిపై ఇంధనశాఖ మంత్రి సునిల్‌కుమార్‌ ట్వీట్‌ చేస్తూ సిద్దరామయ్యకు కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. హెగ్డేవార్‌ 1940లో మృతిచెందారని, క్విట్‌ ఇండియా ఉద్యమం 1942లో జరిగిందన్నారు. కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు వారి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని విరుచుకుపడ్డారు. విమర్శల కోసం విమర్శలు కాకుండా వాస్తవ స్థితికి అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు. బీజేపీ నేత‌లూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి