
507views
పూరీ: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర నిర్మాణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగన్నాథ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్నాథ సేన సమన్వయకర్త ప్రియదర్శన్ పట్నాయక్ పూరీలోని సింహద్వార ఠాణాలో ఒవైసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ.. ఇటీవల ఒవైసీ సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో పూరీలోని జగన్నాథ ఆలయాన్ని బౌద్ధులు నిర్మించారని చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.
ఎంపీ అవగాహన రాహిత్యానికి ఇవి నిదర్శనమన్నారు. బౌద్ధ కాలం కంటే ముందే ఇంద్రద్యుమ్న అనే రాజు ఆలయాన్ని నిర్మించారని, ప్రస్తుతం శ్రీక్షేత్రంగా అలరారుతున్న జగన్నాథుని ఆలయాన్ని చోడగంగదేవ్ అనే రాజు కట్టారని తెలిపారు. చరిత్ర తెలియకుండా మాట్లాడిన ఒవైసీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పట్నాయక్ వెల్లడించారు.





