
499views
మంగోలియా: బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర కపిల వస్తు అవశేషాలను 11 రోజులపాటు ప్రదర్శన నిమిత్తం మంగోలియాలో ఓ మఠంలో ఉంచారు. వీటిని భారత్ నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని బృందం తీసుకువచ్చింది. భారత్‌లోని హిమాలయ పర్వతాల నుంచి మంగోలియా వరకు అనేక శతాబ్దాల క్రితమే బౌద్ధ మతం విలసిల్లిందని రిజిజు ఈ సందర్భంగా చెప్పారు. రెండు దేశాల ప్రజల మధ్య ఆధ్యాత్మిక బంధం కొనసాగుతోందన్నారు. ద్వేషానికి, హింసకు తావు ఇవ్వకూడదని ఆయన ఈ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.





