
235views
వాషింగ్టన్: అన్ని ఉగ్రవాద ముఠాలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్టు ఆ దేశంలో అమెరికా నూతన రాయబారి డొనాల్డ్ బ్లోమ్ పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై పోరుపై పాక్ నిబద్ధత రానున్న కాలంలో అమెరికా-పాక్ సంబంధాల తీరును నిర్ణయిస్తుందన్నారు. ఉగ్రవాదంపై సమర్థంగా పోరాడటానికి మిత్రదేశాలతో అమెరికా చేతులు కలుపుతుందని బ్లోమ్ తెలిపారు. ఉగ్రవాదులు విదేశాల్లో దాడులు చేయడానికి అఫ్గానిస్థాన్ గడ్డను ఉపయోగించుకోకుండా అక్కడి తాలిబన్ ప్రభుత్వంపై పాక్‌తో కలిసి ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ‘డాన్’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా కుట్ర వల్లే తనను ప్రధాని పదవి నుంచి తొలగించారని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, దాని గురించి పట్టించుకోకుండా ముందుకుసాగుదామని బ్లోమ్ సూచించారు.