News

శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన కానుక‌లు సమర్పించిన భక్తురాలు

482views

తిరుప‌తి: చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. ఆలయంలో టీటీడీ ఈవోకి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150 కిలోలు కాగా, వీటి విలువ సుమారు రూ.2.45 కోట్లు ఉంటుంది. దీంతో పాటు దాతలు చెన్నైలో తమకు చెందిన రూ.3.50 కోట్లు విలువైన స్థలాన్ని తితిదేకు అందించేందుకు సిద్ధపడ్డారు. అయితే, స్థలాన్ని టీటీడీ రెవెన్యూశాఖ అధికారులు తనిఖీ చేసిన అనంతరం అధికారికంగా తీసుకుంటామని భక్తురాలికి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి