News

బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో ఉగ్రవాదులను గుర్తించాం!: ఐజీపీ

283views

శ్రీనగర్(జమ్మూ- కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను గుర్తించామని, వారిని త్వరలోనే మట్టుబెడతామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) కశ్మీర్ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. బ్యాంకర్ విజయ్ కుమార్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో నివాసం ఉంటూ కుల్గామ్‌లో పనిచేస్తున్నాడు.

క‌శ్మీరీ టీవీ నటుడు అమ్రీన్ భట్ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి, మ‌ట్టుబెట్టామ‌ని ఐజీపీ కశ్మీర్ ఇటీవలి పౌర హత్యల గురించి వివరిస్తూ చెప్పారు. అమ్రీన్ భట్ హత్యలో ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదుల ప్రమేయం ఉందని తెలిపారు. కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్య గురించి మాట్లాడుతూ, అతని హత్యలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నారని, వారిలో ఒకరు మరణించారని ఐజిపి చెప్పారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి