News

బీహార్ : రోజూ 15 మంది పిల్లలు మిస్ అవుతున్నారు

275views

బీహార్ రాష్ట్రంలో రోజు రోజుకూ పిల్లల మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా రోజుకి 15 మందికి పైగా పిల్లలు మిస్ అవుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయని బీహార్ పోలీసులు విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. గత మూడేళ్లలో మొత్తం 16,559 మిస్సింగ్ కేసులు నమోదవగా… వారిలో కేవలం 7,219 మందిని మాత్రమే పోలీసులు గుర్తించారు. మిగిలిన 9,340 మంది పిల్లలకి సంబంధించిన ఆచూకీ ఇప్పటివరకూ తెలియలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.