
478views
నయా భారత్ అన్ని రంగాలలోనూ తన సత్తా చాటుతోంది. ఇప్పుడు తాజాగా చలనచిత్రరంగంలోనూ తన సత్తాను చాటింది. భారత్ లో అంతర్జాతీయ స్థాయి చిత్రాలు, డాక్యుమెంటరీలు నిర్మాణం కావన్న అభిప్రాయానికి తెరదించుతూ భారతీయ డాక్యుమెంటరీ ఒకటి అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది.
2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి భారతదేశం నుంచి అర్హత సాధించిన ఏకైక డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాప్ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుంది. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పక్షులను రక్షించేందుకు చొరవ తీసుకున్న ఇద్దరు సోదరుల కథ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. గతంలో ఈ చిత్రం వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ ను కూడా గెలుచుకుంది. దీన్ని యువ డైరెక్టర్ శౌనక్ తెరకెక్కించాడు.





