
484views
-
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేతల ప్రశంసలు
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో వ్యాక్సిన్ తయారీ, పంపిణీపై భారత్ అనుసరించిన విధానం పట్ల అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సరైన సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతోపాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న నేతలు కొనియాడారు. వ్యాక్సిన్ సమానత్వం, విస్తృత స్థాయిలో పంపిణీ చేయడంలో భారత్ అనుసరించిన విధానాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా మారే దిశగా అడుగులు వేస్తోన్న భారత్.. ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా స్థాయిలో ఉందని అంతర్జాతీయ వేదికపై నేతలు ఉద్ఘాటించారు.





