
471views
టోక్యో: క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ దేశంలోని టోక్యో నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టోక్యోలో మోదీ బస చేసిన హోటల్ న్యూ ఒటానీలో భారతీయ ప్రవాసుల నుంచి ఘన స్వాగతం లభించింది.
“హర్ హర్ మోదీ’’, ‘‘మోదీ మోదీ’’, వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాలు హోటల్ వద్ద ప్రతిధ్వనించాయి. ప్రవాస భారతీయులు ప్రధాన మంత్రిని చూసి జాతీయ జెండాలు ఊపారు. ప్రధాని రాక సందర్భంగా చిన్నారులు సైతం చేతులు ఊపుతూ పాల్గొన్నారు. పిల్లలు వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లేకార్డులను పట్టుకుని కనిపించారు.
Source: Nijamtoday





