News

ఎవరెస్ట్ ఎక్కిన భారతీయ బాలిక

434views

ముంబై: మహారాష్ట్రకు చెందిన పదేళ్ళ‌ బాలిక చరిత్ర సృష్టించింది. ఎవరెస్టు బేస్ క్యాంప్​ను చేరుకున్న అత్యంత పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా రిథమ్ మమానియా రికార్డు సృష్టించింది. పదకొండు రోజుల్లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్​నకు చేరుకుంది రిథమ్. బాలిక తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్ సైతం ఆమె వెంట వెళ్ళారు. ఈ నెల మొదట్లో వీరు ఈ ట్రెక్కింగ్ పూర్తి చేశారు. రిథమ్ ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయాలో విద్యను అభ్యసిస్తోంది. మే ఆరోతేదీన‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్​ను చేరుకున్నట్టు బాలిక తల్లి ఉర్మి వెల్లడించారు. ఎవరెస్టు బేస్ క్యాంపు 5,364 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 11 రోజుల్లోనే అక్కడికి చేరుకున్నట్టు ఉర్మి తెలిపారు.

“ఎవరెస్ట్ బేక్ క్యాంప్ ట్రెక్కింగ్​లో భాగంగా.. రిథమ్ రోజుకు 8-9 గంటలు నడిచింది. వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉన్నా, మంచువర్షం కురిసినా బెదరలేదు. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. నేపాల్​కు చెందిన సతోరీ అడ్వెంచర్స్ అనే కంపెనీ సాయంతో బేస్ క్యాంప్ వద్దకు వెళ్ళాం. బేస్​ క్యాంప్​ను చేరుకున్న తర్వాత మా బృందంలోని సభ్యులు హెలికాప్టర్ ద్వారా కిందకు రావాలని భావించారు. కానీ, రిథమ్ అందుకు ఒప్పుకోలేదు. నడకదారిలోనే కిందకు వెళ్దామని పట్టుబట్టింది. దీంతో నలుగురం కలిసి కిందకి దిగాం” అని బాలిక తల్లి ఉర్మి వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి