ArticlesNews

బుద్ధుని సమతా సందేశం అమలు చేద్దాం!

693views

సిద్ధార్థుడు గా క్రీ.పూ.563లో కపిలవస్తు వద్ద శ్రీ రాముని వంశంలో శుద్ధోదనుడు, మహా మాయలకు జన్మించాడు సిద్ధార్థుడు. ఇంతకముందు అనేక జన్మలను ఎత్తాడు. వారిది ఇది చివరి జన్మ. తనకు మరో జన్మ లేదని వారే స్వయంగా చెప్పారు. వారిది కారణ జన్మ. 29 సంవత్సరాల వరకు రాజ ప్రాసాదంలో కష్టాలు ఏవీ తెలియకుండా పెరిగాడు.

భార్య, కుమారుడు రాహుల్. ప్రజలు ఎదుర్కొంటున్న దుఃఖాలు… అనారోగ్యం, వార్ధక్యము, మరణం. వీటి నుంచి ప్రజలను దూరం చేయడానికి ఇల్లు, భార్య, కుమారుడు, రాజ సింహాసనం, అన్నీ వదలి దారిలో యోగ విద్యలను నేర్చుకుని 6 సంవత్సరాలు ఆహారం మాని కఠిన తపస్సు చేశాడు. ఫలితం రాలేదు. స్థలం మారి ఆహారం తీసుకుంటూ గయ వద్ద మూడు వారాలు రెండవ మారు తపస్సు చేశాడు. ఈ పూర్ణిమ రోజునే వారికి జ్ఞానోదయం అయింది. దాంతో సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. తాను పొందిన జ్ఞానాన్ని మొట్టమొదటగా కాశీ వద్ద సారనాధ్ వద్ద 5గురు శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. కాలి నడకన 45 సంవత్సరాలు ప్రధానంగా ఉత్తర భారత దేశం అంతటా తిరిగి ధర్మ(దమ్మ) ప్రచారం చేశారు. ఆనాటి ప్రజల వాడుక భాష పాలీలో బోధనలు చేశారు. ఒక పూటే భిక్ష స్వీకరించేవారు.

“ఆ నాటి పండితులకు,మహా రాజులకు, బౌద్ద దీక్ష ఇవ్వడంతో పాటు….

* నిమ్న వర్గాల ప్రజలకు, మహిళలకు సైతం బౌద్ద దీక్ష ఇచ్చారు. ఇది ఒక గొప్ప పని.
* బుద్ధుడు దేవుడు ఉన్నాడని కానీ, లేదని కానీ ఇదిమిద్దంగా చెప్పలేదు.
*ప్రతి మతంలో దేవుడు కేంద్రం. బౌద్ధంలో మాత్రం “మానవుడు” కేంద్రం.
*వారు చెప్పిన మార్గాన్ని “అష్టాంగ మార్గం” గా పేర్కొంటారు. తల్లి,భార్య, కుమారుడు అందరికీ బౌద్ద దీక్ష ఇచ్చారు. 60 మంది బౌద్ధ సన్యాసులను తన తర్వాత బౌద్ధ మత ప్రచారం కోసం తయారు చేశారు.

వారి సందేశంలో….

* అన్ని జంతువుల మీద కరుణ
* మానవులందరి పట్ల బందుభావనతో కూడిన సోదర భావం
* నైతిక విలువలతో కూడిన జీవన విధానం
* అన్ని కులాల ప్రజల పట్ల సమ భావన
* జ్ఞానానికి ప్రాముఖ్యత
* మూఢాచారాలకు నిరసన
* ప్రజాస్వామ్య విలువలతో కూడిన బౌద్ధ సంఘ వ్యవస్థ.”..ఇలా ఎన్నో గొప్ప సందేశాలను వారు మనకు అందించారు.

వారు తమ 80 వ ఏట నేటి గోరఖ్ పూర్ వద్ద “కుషినార” వద్ద అంతిమ శ్వాస విడిచారు. వారి జననం, జ్ఞానోదయం, తుది శ్వాస మూడూ నేటి పూర్ణిమ రోజునే జరగడం ఒక విశేషం. బుద్ధుని అనంతరం వారి శిష్యులు దేశ, విదేశాలలో వారి బోధనలను ప్రచారం చేశారు.

బుద్ధుని అనంతరం వారి అనుయాయులు దేవుడు లేడని ప్రచారం చేయడం, వేదాలను నిరసించడం ,శాంతి పేరున విదేశీ దండయాత్రల పట్ల మౌనం వహించమని రాజులకు బోధ చేయడం, మరి కొందరు బౌద్ధులు విదేశీ ఆక్రమణదారులకు సహకరించడం, ముస్లిం విదేశీ ఆక్రమణదారులు అనేక బౌద్ద అరామాలను విద్వంసం చెయ్యడం, బౌద్ద భిక్షువులను చంపడం”… వీటి వల్ల భారత దేశంలో బౌద్ధం బలహీనపడింది.

* “కుల అసమానతలకు దూరంగా అందరి పట్ల సమ భావంతో, బంధు భావంతో మనం వ్యవహరించాలి” అనే బుద్ధుని సందేశం నేటికీ ఆచరించాల్సిన సందేశం.

మనం అందరం బుద్ధునికి హృదయ పూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి సమతా విధానాల అమలుకు కృషి చేద్దాం.

నేడే బుద్ద పూర్ణిమ

కె. శ్యాంప్రసాద్
సామాజిక సమరసతా వేదిక జాతీయ కన్వీనర్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.