News

ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించాల్సి ఉంది: గ్లోబల్ సదస్సులో ప్రధాని మోడీ సూచన

466views

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ఠపరిచాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు రెండో గ్లోబల్ కొవిడ్ సదస్సు ను ఉద్దేశించి వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజా కేంద్రక వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. కొవిడ్ సవాళ్లను అధిగమించే చర్యలకు ప్రస్తుత సదస్సు మార్గం చూపాలని, పటిష్టమైన విధానాలను రూపొందించాలని అభిలాషించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి