News

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష పుష్పార్చన

481views

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పురస్కరించుకుని లక్షపుష్పార్చన పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో గర్భాలయంలోని స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు.

స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం కాగా, అర్చకులు, వేదపండితులు లక్షపుష్పార్చన నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి