
359views
మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్‌లోని ఓ భవనం లక్ష్యంగా దుండగులు గ్రెనేడ్ విసిరినట్టు తెలుస్తోంది. దుండగుల దాడితో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కారులో వచ్చిన ఇద్దరు అనుమానిత వ్యక్తులు రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రనేడ్ (ఆర్పీజీ)ని 80 మీటర్ల దూరం నుంచి ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇది లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా పేలుడు మాత్రం సంభవించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాకెట్ లాంచర్ ను డ్రోన్ ద్వారా ప్రయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు.





