
608views
భాగ్యనగరం: సరూర్ నగర్లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ అందరూ చూస్తుండగానే దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఈ ఘటన చట్టాన్ని లెక్కచేయకపోవడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ఈ ఘటనకు సంబంధించి నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.
పరువు హత్య ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ముస్లిం మహిళను వివాహం చేసుకున్న నాగరాజును యువతి సోదరుడు హత్య చేసిన విషయం విదితమే.
Source: Nijamtoday





