
557views
పాటియాలా: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాటియాలా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు పంజాబ్ సర్కారు తెలిపింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆపివేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఖలిస్థాన్ అనుకూల ఉద్యమ ప్రయత్నానికి వ్యతిరేకంగా నగరంలో పాదయాత్ర నిర్వహించడంతో కొన్ని గ్రూపుల ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పాటియాలా రేంజ్), సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





