
ఇజ్రాయిల్ : ఇజ్రాయిల్ పోలీసులు అల్ అక్సామసీదుపై శుక్రవారం జరిపిన దాడిలో 42 మంది గాయపడినట్లు పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం చివరి శుక్రవారం మసీదు ఆవరణలోకి ఇజ్రాయిలీ సెట్లర్లు ప్రవేశించడంతో ఘర్షణలు మొదలయ్యాయి.
అప్పటి నుండి రెండు వారాలుగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ముస్లింలకు మూడో అత్యంత ప్రధానమైన ప్రార్థనా స్థలిగా పేరొందిన అల్ అక్సా మసీదులో కొంత భాగాన్ని యూదులు ఆక్రమించుకుని అక్కడ ప్రార్థనలు చేయడానికి యత్నించారు. దీనికి ముస్లింలు అభ్యంతరం తెలపడంతో ఘర్షణకు దిగినట్టు రెడ్ క్రెసెంట్ తెలిపింది.
ఇజ్రాయిల్ ఆక్రమిత తూర్పు జెరూసలెం ప్రాంతంలో ,700 మంది యూదు సెట్లర్స్ ఉన్నారు. రంజాన్ మాసంలోనే యూదుల పండగ కూడా రావడంతో టెంపుల్ మౌంట్ సందర్శనకు వెళ్ళే ఇజ్రాయిలీయులు అల్ అక్సామసీదులో ప్రవేశించి కొంత భాగం తమకు ఇస్తే అక్కడ తమ దైవాన్ని నెలకొల్పుకుంటామని వాదనకు దిగారు.
గత రెండు వారాలుగా జరుగుతున్న ఈ హింసలో ఇప్పటివరకు 300 మంది పాలస్తీనీయులు గాయపడ్డారు. మార్చి 22న ఇజ్రాయిల్‌లోను, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలోను హింసాత్మక దాడులు చోటు చేసుకున్నప్పటి నుంచి జెరూసలెంలో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
Source: Nijamtoday





