
-
బురఖా ధరించిన మహిళ ఆత్మాహుతిగా పోలీసుల అనుమానం
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్శిటీ సమీపంలో బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చైనీయులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం (ఏప్రిల్ 26) కరాచీ యూనివర్సిటీలోని వాణిజ్య విభాగం వెలుపల వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ వర్సిటీ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం 2:30 గంటలకు సంభవించిన పేలుడులో బహుళ చైనా జాతీయులతో సహా మొత్తం నలుగురు మరణించారు.
کراچی کے علاقے مسکن چورنگی کے قریب غیر ملکی وین میں دھماکا۔ پولیس کے مطابق دھماکے کے بعد وین میں آگ لگ گئی، تین افراد ہلاک، ایک کی حالت تشویشناک بتائی جاتی ہے۔#Karachi #Blast #Pakistan @Natsecjeff pic.twitter.com/KpN1STf3xO
— Shabbir Hussain Turi (@ShabbirTuri) April 26, 2022
పేలుడు సంభవించినప్పుడు వాహనం కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ వైపు తిరుగుతున్నట్టు డాన్ నివేదించింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల్లో తెల్లటి వ్యాన్‌ను చూపించే అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించాయి. చుట్టుపక్కల ప్రేక్షకులతో ఆ ప్రాంతం కనిపిస్తుంది. పేలుడుకు కారణాన్ని పోలీసులు ధ్రువీకరించనప్పటికీ, హైస్ వ్యాన్‌లో సిలిండర్ పేలుడు జరిగిందని ఈడి రెస్క్యూ సర్వీసెస్ పేర్కొంది.
పాకిస్తాన్ డైలీ కథనం ప్రకారం, పేలుడులో ఒక మహిళ, వాహనం డ్రైవర్ మరణించారు.
#BREAKING: A blast reported near Karachi. Casualties expected. The injured have been moved to the hospital. #Karachi #IBA pic.twitter.com/mzMO8xuEa9
— The Pakistan Daily (@ThePakDaily) April 26, 2022
కారులో మొత్తం 7-8 మంది ఉన్నట్టు జియో న్యూస్ వెల్లడించింది. ఇది ప్రమాదమా? లేక ఉగ్ర దాడా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు గుల్షన్ ఎస్పీ తెలిపారు. నివేదికల ప్రకారం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేలుడుకు బాధ్యత వహించింది. మృతుల్లో కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ హువాంగ్ గైపింగ్ కూడా ఉన్నారని వారు పేర్కొన్నారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది బురఖా ధరించిన మహిళ చేత జరిగిన ఆత్మాహుతి పేలుడు కావచ్చునని కరాచీ పోలీస్ చీఫ్ గులాం నబీ మెమన్ తెలిపారు.
Source: OpIndia





