
422views
జమ్ముకశ్మీర్: అనేక మంది జవాన్లు, పౌరుల్ని బలిగొన్న కరడుగట్టిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రూను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అతడితోపాటు మరో ముష్కరుడినీ హతమార్చారు. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
గతంలో బద్గామ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో స్పెషల్ పోలీసు అధికారి, అతని సోదరుడు సహా మరో ఇద్దరు మరణించారు.. ఈ దాడిలో కంత్రూ హస్తం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ ఒక గొప్ప విజయమని పోలీసులు పేర్కొన్నారు.
Source: EtvBharat





